మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
చేసిన పనికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ దళిత మాజీ సర్పంచ్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటప్ప గతంలో పలు కాంట్రాక్టు వర్కులు చేశాడు.వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించాడు.తాను ఎన్ని సార్లు బిల్లులు పెట్టుకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు వెంటనే తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వెంకటప్పకు ఏదైనా జరిగితే దానికి రేవంత్ రెడ్డే కారణమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.