మాజీ ప్రధానికి మరణశిక్ష ముప్పు..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో కొత్త కేసు నమోదయ్యింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ప్రాసిక్యూటర్ అధికారికంగా ఆమెపై నేడు చార్జిషీట్ సమర్పించింది. భయంకరమైన ఈ నేరాలు రుజువైతే ఆమెకు మరణశిక్ష విధించవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ చార్జిషీట్‌లో ఆమెతో పాటు బంగ్లాదేశ్ మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ ఐజీపీ చౌదరి మామున్‌లు కూడా సహ నిందితులుగా ఉన్నారు. గత ఏడాది జూలై-ఆగస్టులలో దేశవ్యాప్త హింసకు, ఆ తరువాత జరిగిన పోలీసు అణచివేతకు షేక్ హసీనా ప్రధాన ప్రేరేపకురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని ఫలితంగా ఊచకోత జరిగింది. మే 12న, దర్యాప్తు అధికారులు ఒక నివేదికను సమర్పించారు. అందులో హసీనా హత్యలకు ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే..