మాజీ ఎంపీ హెల్త్ కండీషన్ సీరియస్
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు.


 
							 
							