వాష్‌రూమ్‌లో జారిపడ్డ మాజీ ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లో జారిపడ్డారు.దీంతో ఆయన తలకు గాయమైంది.బంధువులు,పార్టీ నాయకులు అయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.కాగా కాసు మహేష్ రెడ్డి కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.తన తలకు స్వల్పగాయమైందని,కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.కాగా ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వైసీపి అభిమానులు,కాసు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు.