మొసళ్లను పెంచుతున్న మాజీ ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్‌లో బీజెపి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మొసళ్ల పెంపకం కలకలం రేపింది. ఐటి సోదాలకు వెళ్లిన అధికారులు ఈ ఘటనను చూసి అవాక్కయ్యారు.బీజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్షన్ రాథోర్..రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించి అనేక సార్లు నోటీసులు జారీ చేశారు.అయినా ఆయన నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపి రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. మరోవైపు కేశర్వాణి అనే మరో వ్యక్తి రూ.140 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన పత్రాలను సైతం అధికారులు రాథోడ్ ఇంట్లోనే గుర్తించారు. ఓ వ్యాపారంలో వీరిద్దరూ భాగస్యాములుగా ఉన్నట్లు కనుగొన్నారు.అయితే కాంపౌండ్ మొత్తం కలియతిరిగే క్రమంలో రాథోర్ ఇంటి ఆవరణలో ఉన్న భారీ చెరువులో మూడు మొసళ్లను ఐటి అధికారులు గుర్తించారు.వెంటనే అటవీశాఖాధికారులకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.దీంతో మొసళ్లను అటవీ శాఖా సిబ్బంది స్వాధీనం చేసుకుని జూకి తరలించారు.


 
							 
							