మాజీ ఎమ్మెల్యే పట్నంకి రిమాండ్
బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొండగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడి కేసులో బుధవారం ఆయన్ను పరిగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ నివాసంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.అనంతరం 4 గంటల పాటు విచారించారు.సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టగా నరేందర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.దీంతో కొండగల్ అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇదే కేసులో ఇప్పటికే 12 మందికి రిమాండ్ విధించగా మరో 30 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


 
							 
							