అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల రాప్తాడులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర చోటుచేసుకున్న పరిణామాలపై తోపుదుర్తితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు తోపుదుర్తి ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఎక్కడికి వెళ్లారో తెలియదని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

