Home Page SliderTelangana

కేసీఆర్ ఫాంహౌస్ లో మాజీ మంత్రికి అస్వస్థత

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్తత కు గురయ్యారు. నిన్న పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతనగా ఎర్రవెల్లిలోని ఫాం హౌజ్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత సబిత ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను రాత్రి 11గంటల ప్రాంతంలో ములుగు మండలంలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తెల్లవారు జామున 3గంటలకు డిశ్చార్జ్ చేయడంతో ఆమె ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.