మాజీ ఐపీఎస్ అరెస్ట్..
ఏపీలోని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఆయనను సీఐడీ అధికారులు ముంబయి నటి జెత్వానీకి వేధింపుల కేసులో అరెస్టు చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని ఆయన నివాసంలో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఆయనను అరెస్టు చేసి, ఏపీకి తరలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. జెత్వానీ కేసులో పూర్తి స్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చిన సీఐడీ వారిపై కేసులు నమోదు చేసింది. అయితే ఏపీ హైకోర్టులో వారు ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేయడంతో వారికి బెయిల్ మంజూరయ్యింది.
Breaking news: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ED నోటీసులు

