Home Page SliderNational

హిందీ భాషపై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ మన జాతీయ భాష కాదని అశ్విన్ అన్నారు గురువారం రాత్రి తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని రాజలక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే.. ప్రసంగించే ముందు తాను ఏ భాషలో మాట్లాడాలని కార్యక్రమానికి వచ్చిన వారిని అశ్విన్ ప్రశ్నించారు. ఇంగ్లిష్ లో మాట్లాడాలా? అని అడగ్గా అందరూ చప్పట్లు కొట్టారు. తమిళంలో మాట్లాడాలా? అని ప్రశ్నించగా అందరూ ఇంకా బిగ్గరగా అరిచారు. ఇక హిందీ అనగానే అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈ క్రమంలో అశ్విన్ మాట్లాడుతూ.. హిందీ మన జాతీయ భాష కాదు… కేవలం ఓ అధికారిక భాష మాత్రమేనని తెలిపారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన కొన్ని వారాల వ్యవధిలోనే అశ్విన్ ఇలా హిందీపై కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.