Home Page SliderNational

మాజీ సీఎం కూతురు ప్రేమ వివాహం .. స్టెప్పులేసిన పంజాబ్ సీఎం

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కుమార్తె హర్షిత ప్రేమ వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు సంభవ్ జైన్ ను హర్షిత పెళ్లాడారు. ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం జరిగిన ప్రదేశం మహారాజా ఆఫ్ కపూర్తలా ఉన్న నివాసంగా గుర్తింపు పొందింది. కూతురు వివాహాన్ని కేజీవాల్ దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంగీత్ కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ సింగ్ బాంగ్రా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. మరోవైపు హర్షిత, సంభవ్ జైన్ ఢిల్లీ ఐఐటీలో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఈ క్రమంలో వారి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ ఇటీవలే ఒక స్టార్టప్ కంపెనీ కూడా ప్రారంభించారు.