Home Page SliderTelangana

యశోద ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు డాక్టర్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.