యూట్యూబ్ మాజీ సీఈవో మృతి
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ డయాన్ వోజ్‌కికీ(56) క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అమెరికాకు చెందిన సుసాన్ 2014 నుండి 2023 వరకూ యూట్యూబ్ సీఈవోగా పనిచేశారు. ఈ విషయాన్ని ఆమె భర్త డెన్నిస్ ట్రాపర్ వెల్లడించారు. ఆమె మృతిపై పలువురు విచారం వ్యక్తం చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆమె మృతిపై ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె గూగుల్ సంస్థలో ముఖ్యపాత్ర వహించారని, యూట్యూబ్, గూగుల్ రెండు సంస్థలూ ఆమె సలహాలతో అభివృద్ధి చెందాయని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఆమె తనకు మంచి స్నేహితురాలని, ఆమె క్యాన్సర్‌తో పోరాడి మరణించడం చాలా బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.


 
							 
							