PoliticsTelanganatelangana,

తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సచివాలయంలో డీజీపీ జితేందర్‌, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌  కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదనల పై చర్చించారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సుమారు 2000 మందితో కూడిన బలమైన బలగాలను ఏర్పాటు చేసెందుకు, అవసరమైన బడ్జెట్ కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారని సి.ఎస్. తెలిపారు. TGSP బెటాలియన్‌ల నుండి మొత్తం 1000 మంది సిబ్బంది (ఒక్కో సంస్థ 100 మంది సిబ్బందితో కూడినది) అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమానంగా శిక్షణ పొందుతారు. ఈ బృందాలను అత్యవసర పరిస్థితిలో సంబంధిత ప్రదేశాలలో అందుబాటులో ఉంచబడతారు.