crimeHome Page SliderTelangana

ఆన్‌లైన్‌లో విదేశీ గంజాయి..విస్తుపోయిన పోలీసులు

గంజాయి పెడ్లర్లు తెలివి మీరిపోయారు. నేరుగా గంజాయి విక్రయాలతో పట్టుబడకుండా ఆన్‌లైన్‌లో కూడా వ్యాపారం మొదలుపెట్టేశారు. విదేశాలలో తయారయ్యే నీటిలో ప్రత్యేకంగా పండించే ఓజీ అనే రకం గంజాయిని డార్క్ వెబ్‌నెట్‌తో కొనుగోలు చేసి, కొరియర్‌లో దిగుమతి చేసుకున్నారు. ఈ సంగతి తెలిసిన పోలీసులు విస్తుపోయారు. హైదరాబాద్‌లోని స్థానిక రాజేంద్రనగర్‌కు చెందిన సులేమాన్, అస్లాం, మెహదీపట్నంకు చెందిన అక్రం అనే వ్యక్తుల ద్వారా ఈ గంజాయిని గ్రాముల వారీగా ప్యాకింగ్ చేసి నగర వ్యాప్తంగా ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిపై దాడులు నిర్వహించి దాదాపు రూ.72 లక్షల విలువైన 34 ప్యాకెట్ల గంజాయి, సెల్‌ఫోన్లు, టూ వీలర్లు, వెయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.