పోలీసుల అదుపులో ఫారిన్ అమ్మాయిలు
హైద్రాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు.గౌలిదొడ్డి టి.ఎన్.జి.వో కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో ఓ యువకుడు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి సెక్స్ రాకెట్ గుట్టుని రట్టు చేశారు.కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ లక్షలు వసూలు చేస్తున్నట్లు పలువురు మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్.టి.ఎఫ్ అధికారులు దాడులు చేశారు.9 మంది ఫారిన్ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.పోలీసులు …ఫారిన్ అమ్మాయిలను పోలీస్ స్టేషన్‌కి తరలించారు.కేసు నమోదు చేసుకున్నారు.పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

