Breaking NewscrimeHome Page Slider

విషంగా మారుతున్న భోజ‌నం

నారాయణపేట జిల్లాలో బాలుర ఉన్నత పాఠశాలలో మ‌ధ్యాహ్న‌ భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు.దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాలో జ‌ర‌గుతున్న వ‌రుస భోజ‌న విక‌టిత ఘ‌ట‌న‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు వాంతులు కడుపునొప్పి వేయడంతో… పాఠ‌శాళ ఉపాధ్యాయులు హుటాహుటిన వైద్యులను స‌మాచారం అందించి పాఠశాలకు పిలిపించి ప్రాధ‌మిక వైద్య చికిత్స చేయించారు.అనంత‌రం ప‌లువురు విద్యార్ధులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై పోలీసులు,సంక్షేమ‌శాఖ అధికారులు,విద్యాశాఖాధికారులు క‌మిటీ గా ఏర్ప‌డి విచారిస్తున్నారు.