కుంభమేళాలో తిండికి కటకట..
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు విశేషంగా కోట్లలో ప్రజలు పోటెత్తుతున్నారు. దీనితో భారీగా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ వల్ల పూర్తిగా ప్రయాగలో వాహనాలను నిషేధించారు. ప్రయాణికుల వాహనాలతో పాటు నిత్యావసర సరుకులను తరలించే, రవాణా వాహనాలు కూడా ప్రయాగకు చేరలేకపోతున్నాయి. దీనివల్ల అక్కడ నిత్యావసర సరుకులు లభ్యం కావడం లేదు. కనీసం పాలు, బ్రెడ్ వంటి కనీస అవసరాలు కూడా దొరకడం లేదు. నగరంలోని గిడ్డంగులలో చక్కెర, గోధుమలు, మైదా నిల్వలు ఖాళీ అయిపోతున్నాయి. పప్పుధాన్యాలతో నిండిన ట్రక్కులు గత కొన్ని రోజులుగా చక్‌ఘాట్ సరిహద్దు వద్దనే ఉండిపోయాయి. వాటిని అనుమతించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ కొరతను తీర్చడానికి ప్రభుత్వం చొరవ చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.