శ్రీవిశ్వ జూనియర్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్
విశాఖలోని శ్రీవిశ్వ జూనియర్ కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 7గురు విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లో రాత్రి ఆహారం తిన్న విద్యార్ధులు రాత్రి నుంచి తీవ్ర వాంతులు,విరేచనాలతో బాధపడుతున్నారు.సహచర విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేయడంతో వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.కాగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.అయితే ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.పోలీసులు హాస్టల్ కి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

