హోలీ నాడు కళ్లు, చర్మం పాడవ్వకుండా ఇవి పాటించండి.
“హోలీ”, ఈ పండగ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సెలెబ్రేట్ చేసుకునే పండగ హోలీ. ఆరోజు అందరు రంగులతో ఆడుకుంటారు.కాబట్టి సహజమైన రంగులతో ఆడుకుంటే చాలా మంచిది. మనం ఎంత సహజమైన రంగులతో ఆడుకున్న ఒక్కొక్కసారి ఆ రంగు మన కళ్ళల్లో కానీ, గోళ్ళల్లో కానీ వెళ్లిపోతుంటాయి. వాటి వాళ్ళ మనం ఇబ్బంది పడాల్సొస్తుంది. కాబట్టి మనం వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ రంగులు చల్లుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రంగులు కళ్లలో పడకుండా కళ్లజోడు వాడడం మంచిది. కళ్లలో ఏదైనా పడితే చేత్తో రుద్దకూడదు. ఏవైనా రంగులు పడితే ముందుగా గోరువెచ్చని నీటితో కళ్లని కడిగేయాలి.
చర్మం కోసం ముందుగా చర్మాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత ముఖానికి ఏదైనా మోయిశ్చరైజర్ రాయాలి. దానివల్ల రంగులు చర్మం లోపలి వెళ్లకుండా ఉంటాయి. అలాగే నూనె రాయడం వలన రంగులు తొందరగా వదులుతాయి.