Home Page SliderTelangana

ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం.. ఈసీ ప్రకటన

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా.. మిగతా వారి నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా అవి తిరస్కరించబడ్డాయి. దీంతో ఈ ఐదుగురు ఏకగ్రీవం అయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా.. వాటిలో ఒకటి పొత్తులోభాగంగా సీపీఐకి కేటాయించింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి 4 గురు, సీపీఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కు ఒక స్థానం రాగా.. ఆ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. వీరంతా ఏకగ్రీం అయినట్టు ఈసీ ప్రకటించింది.