Andhra PradeshNews

ఏపీలో 10 వేల రూపాయలు మత్స్యకార భరోసా

ప్రతీ మత్స్యకార కుటుంబానికి వేట నిషేధ సమయంలో మత్య్సకార భరోసా కింద  10 వేల రూపాయల సహాయం అందుతుందని మంత్రి అప్పలరాజు తెలిపారు.  అంతే కాదు, వీరికి అనేక పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మత్స్యకారులకు HSD ఆయిల్ సబ్సిడీ పథకం కింద డీజిల్ కొట్టే సమయంలోనే లీటరుకు 9 రూపాయలు సబ్సడీగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కింద ఇస్తున్నామన్నారు.

వారికి రకరకాల ఇన్‌పుట్స్ ఇస్తున్నామని, PMMSY  పథకం కింద స్టాకింగ్ ఇస్తున్నామని, వలలు, బోట్లు, డీప్ సీ ఫిషింగ్ పరికరాలు, మోటార్ సైకిల్స్ విత్ ఐస్‌బాక్స్, మార్కెటింగ్‌కు సంబంధించిన పరికరాలు ఇస్తున్నామని వెల్లడించారు.  బ్లూ రెవల్యూషన్ స్కీం కింద కేంద్రప్రభుత్వం ప్రకటించిన హౌసింగ్ సదుపాయాలతో పాటు  50 సంవత్సరాలు వయస్సు దాటిన మత్స్యకార సంఘంలో ఉండే వారికి పెన్షన్ స్కీంలు, మత్య్సకార సొసైటీలకు పబ్లిక్ వాటర్ బాడీస్‌లో చేపలు పట్టేందుకు నామమాత్రపు ఫీజుతో లైసెన్స్ మంజూరు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోందని ఏపీ మత్స్యకార, పశు సంరక్షక శాఖ మంత్రి అప్పలరాజు అసెంబ్లీలో వెల్లడించారు.