crimeHome Page SliderNational

బర్త్ డే పార్టీలో కాల్పులు.. ముగ్గురు మృతి

బర్త్ డే పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ఘటన హర్యానాలోని పంచకులలో జరిగింది. హోటల్ సుల్తా నతేలో ఇవాళ తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతులు విక్కీ, వినీత్ అని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కాల్పుల్లో మరణించిన మహిళ హిసార్ వాసిగా ప్రాథమికంగా గుర్తించారు. మృతుల్లో ఒకడైన విక్కీ ఒక అనుమానిత నేరస్థుడు కావడంతో ఈ సంఘటన గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.