రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేటు బస్సులో మంటలు
విజయవాడ బస్టాండ్ దగ్గర ప్రైవేటు బస్సు ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో కృష్ణలంక రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.