పాక్ హోం మంత్రి ఇంటికి నిప్పు
పాకిస్తాన్ ప్రభుత్వంపై సామాన్య పాక్ ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌కు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సింధ్ ప్రావిన్స్‌లో ఆందోళన పెరిగిపోయింది. నీరు లేకపోవడంతో పాక్ ప్రజలు నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. పాక్ హోం మంత్రి జీయా ఉల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టి తగలబెట్టారు. పాక్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమ వ్యవసాయ భూములకి, తాగునీటికి ముప్పు వాటిల్లుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ రహదారిని నిర్భందించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలలో ఇద్దరు పౌరులు మరణించగా, పోలీస్ అధికారులు అనేకమంది గాయపడ్డారు.