శంషాబాద్‌లోని కన్వెన్షన్ లో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఓ కన్వెన్షన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఈకేఏఎం కన్వెన్షన్ హాల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల ధాటికి పొగలు ఆకాశాన్ని అంటాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తోంది. శంషాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై కన్వెన్షన్ యజమాని మహేష్ యాదవ్ స్పందించారు. కరెంటు పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. వెల్డింగ్ చేస్తుండగా చిన్నగా ఫైర్ ఆక్సిడెంట్ అయి మొత్తానికి కన్వెన్షన్‌లో మంటలు చెలరేగాయి. సుమారు ఏడు కోట్ల నష్టం జరిగిందని మహేష్ యాదవ్ పేర్కొన్నారు.