మహీంద్రా షోరూంలో మంటలు
కొండాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.కొత్తగూడలోని వీవీసీ మోటార్స్ (మహీంద్రా మోటార్స్) షోరూంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.దీంతో ఒక్క సారి మంటలు భారీ ఎత్తున వ్యాపించాయి.అగ్ని కీలలు ఆకాశానికి ఎగసిపడ్డాయి.క్షణాల వ్యవధిలో షోరూం అంతా అగ్నికి ఆహుతయ్యింది.జ్వలన తీవ్రత గలిగిన ఇంధనాలు పోసి మంట పెట్టినట్లుగా షోరూంలోని అన్నీ భవనాలకు మంటలు వ్యాపించాయి.దీంతో షోరూంలోని వాహనాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నిలువరించే ప్రయత్నం చేశారు.పక్క షాపులు,భవనాలకు మంటలు వ్యాపిస్తుండగా అగ్నిమాపక దళ సభ్యులు నిలువరించి ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.