నాంపల్లి పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం
హైద్రాబాద్‌లోని నాంపల్లి పెట్రోల్ బంక్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది.మథ్యాహ్నం లారీ నుంచి పెట్రోల్ ని అండర్ టన్నెల్స్‌కి ఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పెద్ద ఎత్తున పరిసరాల్లో మంటలు వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక విపత్తుల స్పందన శాఖ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నిలువరించింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.మధ్యాహ్నం వేళ కావడంతో పెట్రోల్ కోసం వినియోగదారులు ఎవరూ రాకపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు.