ఎట్టకేలకు డేట్స్ ఇచ్చిన పవన్
అటు రాజకీయాలు ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ నుండి బస్సు యాత్రతో సందడి చేయబోతున్నారు. ఈలోగా హరిహర వీరమల్లు , వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేయాలని దర్మకులు ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఇంతవరకు సెట్స్ పైకి పవన్ రానేలేదు. దీంతో పవన్ డేట్స్ విషయంలో కొంతమేర అవకతవకలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ విషయం పై పవన్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ చివర్లో షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. హరిహర వీరమల్లు టీజర్‌తో పవన్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న పవన్ , ఇంత సడన్‌గా తన డెసిషన్ చెప్పడంతో.. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి పవన్ తన మనస్సు మార్చుకున్నట్టు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

