Home Page SliderTelangana

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం..

నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై  సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. రాజకీయాలలోకి అనవసరంగా నటుల వ్యక్తిగత జీవితాలను లాగడం సమంజసం కాదని, ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు, నటులు ట్వీట్లు పెట్టారు. దీనితో ఈ అంశంపై ఈ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించనుంది. దీనితో వారేం చెప్తారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, నాని, రోజా, ఖుష్భూ వంటి అనేకమంది ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి కొండాసురేఖకు  లీగల్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఎవ్వరినీ నొప్పించాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, అనుకోకుండా అలా జరిగిందని మంత్రి పేర్కొన్నారు.