నంది అవార్డులపై ఫిల్మ్ చాంబర్ కీలక ప్రకటన
టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై ఫిల్మ్ చాంబర్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల12న దుబాయ్‌లో నంది అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అయితే ఈ నంది అవార్డుల ప్రధానోత్సవంతో ఫిల్మ్ చాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. కాగా తెలంగాణా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాష్ట్ర గుర్తింపు లేదని పేర్కొంది. అయితే నంది అవార్డుల పేటెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని తెలంగాణా ఫిల్మ్ చాంబర్ స్పష్టం చేసింది.గతంలో ఈ నంది అవార్డుల ప్రకటనపై పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిల్మ్ చాంబర్ ఈ ప్రకటనను విడుదల చేసినట్లు తెలుస్తోంది.