బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ ప్రముఖులు
బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా చర్యలు తీసుకోవాలని వినయ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు ఈ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్లకు, సినీ నటులకు కూడా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొంత మందిని విచారిస్తున్న పోలీసులు తాజాగా ప్రముఖ నటులు విజయదేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, మంచులక్ష్మిలకు కూడా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.