జేసీపై సినీనటి ఫిర్యాదు
కొద్దిరోజుల కిందట సినీనటి, బీజేపీ నాయకురాలు మాధవీ లతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.అయితే.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీ లత సైబరాబాద్ కమిషనరేట్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించి, తన పరువుకు భంగం కలిగించిన జేసీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 ఏళ్లుగా సైబరాబాద్ కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నానని, అందుకే జేసీ వ్యాఖ్యలపై సైబరాబాద్ లో ఫిర్యాదు చేసినట్లు మాధవీ లత తెలిపారు.

