భూకంప భయంతో భూమాతకు పూజలు..
తెలంగాణ జగిత్యాల జిల్లా శంకులపల్లిలో భూకంపం సంభవించింది. దీంతో గ్రామస్తులు భూకంప భయంతో భూమాత కోపం తగ్గాలని భూరెలతో నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి, పూలు, పండ్లతో అలంకరించి, దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేసి భూకంపాలు పునరావృతం కాకుండా భూమాతకు వేడుకున్నారు.