BusinessHome Page SliderNationalNews Alert

వైరస్ భయంతో రూ. 12 లక్షల కోట్లు నష్టం

భారత్ స్టాక్ ఎక్సేంజి మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలతో కుప్పకూలింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్లు క్షీణించింది. బెంగళూరులో రెండు హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆసియా మార్కెట్ల నుండి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను పడేశాయి. అనంతరం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించింది. దీనికి ప్రధాన కారణం బెంగళూరులో 2, గుజరాత్‌లో 1 కేసులు నమోదు కావడమే. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగడం వల్ల మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కొటక్ మహేంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.