‘క్యాస్టింగ్ కౌచ్‌పై సౌత్‌లో అలా అడుగుతారు’..దంగల్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత సినీ చరిత్రలో రూ.2వేల కోట్ల వసూళ్లు సాధించిన సూపర్ హిట్ మూవీ దంగల్ నటి ఫాతిమా సనా షేక్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. తన కెరీర్లో ఎదురైన అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్యూలో పంచుకున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్‌గా, ఓపెన్‌గా మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. కొందరిని కలవాల్సి ఉంటుందని కూడా చెప్పేవారని పేర్కొన్నారు. ఇటీవల ఒక సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లగా, ఏం చెయ్యడానికైనా సిద్ధమేనా అని డైరక్టర్ అడిగారని, నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేస్తానని చెప్పానని వెల్లడించారు.

