సంగీత ప్రపంచంలో ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్‌కి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇన్నేళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి ఆల్బమ్‌లని సంగీత ప్రియులకి అందించి ఒక ఎవర్ గ్రీన్ ట్రెండ్‌ని సెట్ చేశారు. మరి ఇప్పుడు కూడా కొత్త కొత్త ట్యూన్స్‌తో తన మార్క్ సంగీతాన్ని కొనసాగిస్తున్న రెహమాన్ నుంచి మరో వెర్షన్ రాబోతోంది. మరి లేటెస్ట్‌గా సినీ పరిశ్రమలోకి రెహమాన్ కూతురు కూడా ఒక సంగీత దర్శకురాలిగా పరిచయం కాబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఆమె పేరు ఖతీజా రెహమాన్ కాగా ఆమె తన మొదటి చిత్రంగా “మిన్మినీ” అనే సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. అలాగే ఈ చిత్రాన్ని హలితా షమీమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతున్నారు. అలాగే సంగీత దర్శకత్వంలో అయితే ఖతీజా రెహమాన్ కొత్త ఒరవడికి నాంది పలికారని చెప్పాలి. మరి తన నుంచి ఎలాంటి ట్యూన్స్ రానున్నాయో వేచి చూడాలి.