సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం..తెలంగాణ వాసి సహా 9 మంది భారతీయులు మృతి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది భారతీయులు. వీరిలో ఒక తెలంగాణ వాసి కూడా ఉన్నారు. జగిత్యాల మెట్‌పల్లికి చెందిన రమేశ్ (32) అనే తెలంగాణ వ్యక్తి, మరి కొంత మంది భారతీయ వర్కర్స్ కలిసి, 26 మందితో వెళ్తున్న బస్సుకు జిజినా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారతీయుల మృతిపై అక్కడ జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రమంత్రి జైశంకర్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

