NewsNews AlertTelangana

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఒక బైక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు దాటుతున్న వ్యక్తితో సహా బైక్‌పై ఉన్న ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. అంతలోనే రోడ్డుపై అటుగా వస్తున్న ట్రక్ ఆ ఇద్దరు మీదుగా వెళ్ళింది. దీంతో ట్రక్ టైర్ల కింద పడి ఆ ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు నవదంపతులుగా తెలుస్తోంది. అయితే రోడ్డు దాటుతున్న వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డట్టు సమాచారం. ఈ విధంగా ఈ ఘోర రోడ్డు  ప్రమాదం ముగ్గురి జీవితాలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు ఇంకా తెలియాల్సివుంది.