Home Page SliderNational

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

ఈ మధ్య కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువైయ్యాయి. కాగా ఈ ప్రమాదాలను నివారించేందుకు అధికారుల ఎన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ వాటిని అరికట్టలేకపోతున్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నో రకాల ప్రమాదాలకు అతివేగం ముఖ్యకారణమని తెలుస్తోంది. అయినప్పటికీ వాహనదారులు వీటిని ఎంత మాత్రం పట్టించుకోకుండా..ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. కాగా కర్ణాటకలోని మైసూర్‌లో  వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం హాస్పటల్‌కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన,గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.