ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. జందాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కంకర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

