ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా- -లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఆగి ఉన్న లారీని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. 8 మంది ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.