నేపాల్‌లో ఘోరప్రమాదం..నదిలో పడిన రెండుబస్సులు
నేపాల్‌లో నేడు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయరహదారిపై కొండచరియలు విరిగి పడడంతో ఆ ఘాట్ రోడ్‌లో వెళ్తున్న రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడ్డాయి. నారాయణఘాట్-ముగ్‌లింగ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులలో 7గురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. కాఠ్మాండూ వెళ్తున్న బస్సులో సుమారు 24 మంది ఉన్నట్లు సమాచారం. మరో బస్సులో 41 మంది ఉన్నారు. ఈ బస్సులు గణపతి డీలక్స్, ఏంజెల్ బస్సులుగా గుర్తించారు. ఈ బస్సు నుండి ముగ్గురు ప్రయాణీకులు తప్పించుకున్నారు. ఈ బస్సులలో 65 మంది గల్లంతయ్యారు. ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న మరో బస్సుపై కూడా కొండచరియ విరిగిపడిందని గుర్తించారు. ఈ బస్సు బుట్వాల్ నుండి కాఠ్మాండూ వెళ్తోంది. దీని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ దుర్ఘటనలపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ విచారం వ్యక్తం చేశారు. అక్కడ గాలింపు చర్యలు చేపట్టి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.