కడపలో ఘోర ప్రమాదం..ఐదుగురి మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద వెళ్తున్న కారును లారీ బలంగా ఢికొట్టింది. ఘాట్ మలుపులో వెళ్తున్న కారు పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒక చిన్నారి మగ్గురు మహిళలు ఉన్నారు. వీరు రాయచోటి నుండి కడపకు వెళ్తున్నట్లు సమాచారం.

