ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం-ఐదుగురు మృతి
పంజాబ్లోని శ్రీ ముక్త్సర్ సాహిజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

