ఆసుపత్రిలో ఘోర ప్రమాదం..20 మంది మృతి
చైనాలోని ఒక ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని బీజింగ్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగ్డే నగరం ఉంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింగ్ హోమ్‌లో మంటలు చెలరేగడం వల్ల 20 మంది మృతి చెందారని సమాచారం. మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం సంగతి తెలిసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.