Andhra PradeshHome Page Slider

నంద్యాలలో పురుగుల మందు తాగి చనిపోతామని అధికారులను బెదిరించిన రైతులు

నంద్యాల-జమ్మల మడుగు హైవే వద్ద  సర్వేలు చేయబోయిన అధికారులను అడ్డుకుంటున్నారు రైతులు. సర్వేలు చేస్తే పురుగుల మందులు తాగి చనిపోతామని హెచ్చరిస్తున్నారు. వారి చేతులలో పురుగుల మందుల డబ్బాలు ఉండడంతో ఏం చేయాలో పాలుపోక నిలిచిపోయారు అధికారులు. ఉద్దేశ్యపూర్వకంగానే పేదల స్థలాలను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళనలు చేపడుతున్నారు. వారి స్థలాలలో హైవేనిర్మాణం జరగడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్రవిచారణ అనంతరమే సర్వేలు చేపట్టాలని, తమ భూములు ఆక్రమిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు న్యాయం జరగాలని, బలవంతంగా సర్వేలు చేసి, నిర్మాణాలు చేపడితే పురుగుల మందులు తాగి చనిపోతామని బెదిరిస్తున్నారు.