కోతుల బెడదకు రైతు ఉపాయం..
కోతుల దండు వచ్చిందంటే సర్వనాశనమే. పంటంతా కలియదిరుగుతూ అల్లకల్లోలం చేసేస్తాయి. మొక్కజొన్న, మామిడి పిందెలు వస్తున్న ఈ సమయంలో పంటలు నాశనమయితే రైతు బాధ చెప్పతరం కాదు. దీనితో కోతుల బారి నుండి పంటలను కాపాడుకోవడానికి ఒక కొత్త ఉపాయం ఆలోచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. మైక్‌లలో కుక్క అరుపులు రికార్డు చేసి, పంటల మధ్య అక్కడక్కడ అమర్చారు. దీనితో కుక్కలు పొలాలలో ఉన్నాయని భావించి, కోతులు రావడం లేదట. కానీ మైకులను గమనించాయో అంతే సంగతులు.