‘రైతులకు కేసీఆర్ గుర్తొస్తున్నారు’..కేటీఆర్ కీలకవ్యాఖ్యలు..
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కరీంనగర్ పార్టీ సన్నాహక సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి సన్నాహక సమావేశాన్ని చూస్తే బీఆర్‌ఎస్ బలం తెలుస్తోందన్నారు. నేడు రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వారికి కేసీఆర్ గుర్తొస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ, అణచివేతల రాజ్యంలోని రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. ఈ ప్రభుత్వం 5 డీఏలు బాకీ ఉంది. 16 నెలల్లో 6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నాకు సమయం వచ్చినప్పుడు వారు ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఈ ఏడాది మొత్తం రజతోత్సవం చేసుకుందాం. తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారు పాలకులు. బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. అంటూ మండిపడ్డారు.