ఔను వాళ్లిద్దరూ విడిపోయారు..!
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పారు. వీరిద్దరి విడాకులు గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్నాయి. గురువారం ఇద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారని.. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “విడాకులు జరిగాయి. వివాహం రద్దు చేయబడింది” అని న్యాయవాది అన్నారు. భరణం మొత్తం గురించి న్యాయవాదిని జర్నలిస్ట్ అడిగినప్పుడు, అతను “ఏమీ లేదు, నో కామెంట్స్” అంటూ వెళ్లిపోయారు. చాహల్, ధన శ్రీల వివాహం 2020లో జరిగిన సంగతి తెలిసిందే.
బాంబే హైకోర్టు బుధవారం (మార్చి 19, 2025) క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు అతని విడిపోయిన భార్య ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తప్పనిసరిగా ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేసింది కోర్టు. గురువారం (మార్చి 20, 2025)లోగా వారి విడాకుల పిటిషన్‌ను నిర్ణయించాలని కుటుంబ న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది.